ప్రజావాణిలో 106 వినతులు: కలెక్టర్

హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్య వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు అందించిన వినతులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను పరిశీలించిన కలెక్టర్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ సమస్యలపై నుండి 106 వినతులు అందినట్లు కలెక్టర్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్