416 బియ్యం బస్తాలు స్వాధీనం.. ఒకరి అరెస్ట్.. ఇద్దరు పరారీ

హన్మకొండ చింతగట్టు శివారులో పేదల బియ్యం అక్రమ నిల్వలపై టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7 లక్షల రూపాయల విలువైన 200 క్వింటాళ్ల పంపిణీ బియ్యం, మొత్తం 416 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న ఒర్సు భాను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా, మోటం మధుకర్, చిట్టారి ఎర్రగట్టు అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం పట్టుబడిన నిందితుడిని, బియ్యాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

సంబంధిత పోస్ట్