వరంగల్ నగరంపై మంచు దుప్పటి

వరంగల్ నగరం అంతటా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. తెల్లవారుజాము నుండి ఉదయం 10 గంటలు దాటినా మంచు ప్రభావం తగ్గలేదు. పొగమంచు కారణంగా వాహనదారులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణాలు కొనసాగించారు. రాబోయే కొద్ది రోజులు వాతావరణం ఇలానే కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్