గ్యాస్ లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి భీమదేవరపల్లి మండలానికి చెందినవాడని, అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్