సేంద్రియ గ్రామీణ ఉత్పత్తుల ప్రోత్సాహానికి నూతన ఆరంభం

ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించేందుకు సేంద్రియ వ్యవసాయం, చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచించారు. పబ్లిక్ గార్డెన్స్ లో కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి జాతీయ ఆర్గానిక్ రైతుల సంతను ఆయన ప్రారంభించారు. గ్రామీణ రైతులు ఉత్పత్తి చేసే ఆర్గానిక్ ఆహార పదార్థాలు ఆధునిక ఆహార పదార్థాల కంటే ఎంతో మెరుగైనవని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్