వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఘన వీడ్కోలు

వరంగల్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసి సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ అయిన సన్ ప్రీత్ సింగ్‌కు గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనను ప్రత్యేక వాహనంపై ఉంచి, తాళ్లతో లాగుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. 15 నెలల తన పదవీకాలంలో సిబ్బంది అందించిన సహకారం, సమన్వయం వల్లే శాంతిభద్రతల పరిరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించగలిగామని, వరంగల్ ప్రజల ప్రేమాభిమానాలు జీవితాంతం గుర్తుండిపోతాయని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్