డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి

వర్ధన్నపేటలో భారత జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న ప్రభాకర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. దేశభక్తుడైన ముఖర్జీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పొనగోటి వెంకట్ రావు, గడ్డం మహేందర్, నాగవెల్లి గోపికృష్ణ, బైరి సతీష్ గౌడ్, వస్కుల భాస్కర్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్