వరంగల్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో వరంగల్ కాలేజీ సిబ్బంది పాత్ర ఉన్నట్లు తేలడంతో, ఒక ఉన్నతాధికారితో పాటు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, 8 మంది ఇన్-సర్వీస్ విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేశారు. ఈ లీకేజీ వ్యవహారంపై లోతుగా విచారించేందుకు ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు పలు వ్యవసాయ కాలేజీల్లో రహస్య విచారణ చేపట్టారు.