హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో అభయ్ హిందూ సేన వ్యవస్థాపకులు శ్రీ రాధా మనోహర్ దాస్ ఆధ్వర్యంలో సోమవారం ద్వితీయ వార్షికోత్సవం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీ కమలానంద భారతి, ఎల్ వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్, డాక్టర్ కసిరెడ్డి వెంకట రెడ్డి గారు (HOD ఉస్మానియా యూనివర్సిటీ) పాల్గొన్నారు. భువనకృతి నృత్య కళాక్షేత్రం నుంచి వచ్చిన కూచిపూడి నృత్య కళాకారులు పిల్లలమర్రి శ్రీతి, సాన్విత పెద్ది, శ్రీవల్లి, దీపిక భద్రకాళి అమ్మవారి పాటకు నృత్యం చేసి అందరినీ అలరించారు.