అడిషనల్ ఎస్పీ సదానందానికి తృటిలో తప్పిన ప్రమాదం

ములుగు ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందానికి శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి బయటకు వస్తున్న ఆయన కారును బండారుపల్లి నుంచి ములుగు వైపు వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతింది. అడిషనల్ ఎస్పీ, డ్రైవర్, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕