హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఆఖేరు వాగు నుండి కొత్తనీరు తీసుకువచ్చి శ్రీస్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. ఐనవోలు ఒంటిమామిడిపల్లి చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళలు బిందెలతో నీళ్లను తీసుకొచ్చి వర్షాలు కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని శ్రీ స్వామివారికి ఘటాభిషేకం నిర్వహించడం జరిగింది. దేవాలయ ఆవరణలోని శ్రీ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం నందు అమ్మవారినికి అభిషేకం చేశారు.