దేశ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: నితిన్ నబిన్

వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి శక్తి తెలంగాణ ప్రజలకే కాకుండా దేశ ప్రజల మీద ఉండాలని, వరంగల్ నగరం ఎంతో పవిత్రమైనదని, మన సంస్కృతి సాంప్రదాయాలు దేశం మొత్తం ఉండాలని తెలంగాణ ప్రజలపై అమ్మవారి దయ ఉండాలని ఆ భద్రకాళి శక్తిని ప్రార్థించానని నితిన్ నబిన్ అన్నారు. దేశ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ శక్తిని ప్రార్థించానని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్