పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

వరంగల్ నగరంలో గల రంగశాయిపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల రంగశాయిపేట యందు ఆదివారం రోజున 1984&1985 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. పుప్పాల సువర్ణ, పర్వీన్, చిదురాల నాగమణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల, వివిధ ప్రాంతాల నుంచి 31మంది హాజరై 41సంవత్సరాల చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం పాటలు పాడారు. బతుకమ్మ, ఉయ్యాల ఆటలు, డిజె సౌండ్స్ తో డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. అనంతరం ఆర్గనైజర్లకు ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్

✕
✕