మాజీ ఎంపీటీసీ, సీపీఎం నాయకుడిపై దాడి..పాత కక్షలే కారణమా?

దుగ్గొండి మండలం లక్ష్మీపురం మాజీ ఎంపీటీసీ మామునూరు సుమన్, సీపీఎం మండల నాయకుడు తాళ్లపల్లి రవిపై శనివారం కేశాపురం గుట్ట వద్ద దాడి జరిగింది. గ్రామానికి చెందిన కొందరు దారికాచి దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని పోలీసులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕