భార్యను బావిలో తోసి హత్యాయత్నం.. భర్తపై కేసు

హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో దంపతుల మధ్య తలెత్తిన కలహాలు దారుణానికి దారితీశాయి. మద్యానికి బానిసైన భర్త మెరుగు రవి, భార్య అనితను తరచూ వేధిస్తుండేవాడు. ఈ నెల 15న వ్యవసాయ క్షేత్రంలో ఒంటరిగా ఉన్న అనితను బావిలోకి తోసి హత్యాయత్నం చేశాడు. అనిత కేకలు విని స్థానికులు ఆమెను రక్షించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందిన అనంతరం అనిత ఫిర్యాదు చేయగా, భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొంక అశోక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్