స్వచ్ఛతపై ఆకాశవాణి వరంగల్‌లో అవగాహన

స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు బుధవారం ఉదయం 11 గంటలకు హనుమకొండ విద్యారణ్యపురిలో గల ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్ ఇన్‌చార్జి ఇల్లందుల రవికుమార్, అధికారి నరేష్ కుమార్ పాల్గొని పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. స్వచ్ఛమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను తమ బాధ్యతగా భావించాలని సూచించారు. ఆకాశవాణి ప్రసారాలతో పాటు ప్రత్యక్ష కార్యక్రమాల ద్వారా స్వచ్ఛత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕