కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధి డీజిల్ కాలనీలో, తల్లి మరణించిన మూగ బాలికపై సవతి తల్లి రజియా శారీరకంగా హింసించింది. పండుగ కోసం వచ్చిన బాలికను గుర్తుతెలియని వస్తువుతో కాల్చి వాతలు పెట్టింది. తీవ్ర గాయాలతో బాలిక వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతోంది. కాజీపేట ఎస్సై శివ బాధితురాలి పరిస్థితిని పరిశీలించి, అమ్మమ్మ సుల్తానా ఫిర్యాదు మేరకు ఆన్సైట్ ఎఫ్ఎఆర్ నమోదు చేశారు.