సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు

హనుమకొండ సుబేదారి పోలీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 504, 505 కింద కేసు నమోదు చేశారు. రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హన్మకొండ, వరంగల్ డీసీసీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, మహ్మద్ ఆయుబ్ సీపీ సన్‌ప్రీత్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు.

సంబంధిత పోస్ట్