కాజీపేటలోని రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల్లో అక్రమాలకు పాల్పడిన రైల్వే అధికారులు, కాంట్రాక్ట్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముగ్గురు రైల్వే ఇంజనీర్లు, ఇద్దరు ట్రాక్ నిర్వాహకులు, ఒక కాంట్రాక్ట్ సంస్థపై కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాజీపేట పరిధిలోని రైల్వే కార్యాలయాల్లో సీబీఐ అధికారులు విచారణ జరిపినట్లు ప్రచారం జరిగింది. అయితే, రైల్వే పోలీసు అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని తెలిపారు.