హనుమకొండ లో చైన్ స్నాచింగ్

హనుమకొండలోని బాలసముద్రం శ్రీనివాస నగర్ లో, కాళోజి కళాక్షేత్రం వెనుక హనుమాన్ టెంపుల్ వద్ద గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఒక మహిళ మెడలోంచి గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటనపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసుకుని, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం, మార్చి నెలలో ఇది నాలుగో గొలుసు చోరీ సంఘటన.

సంబంధిత పోస్ట్