ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చికెన్ సెంటర్ల యజమానులు నిరవధిక బందుకు పిలుపునిచ్చారు. పౌల్ట్రీ యజమానులు ఇస్తున్న మార్జిన్ తీవ్రంగా తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిటైలర్లు తెలిపారు. బయట రాష్ట్రాల నుంచి కోళ్లను తక్కువ ధరకు తెచ్చి, తమకు కేవలం రూ. 5 నుంచి 7 వరకు మాత్రమే మార్జిన్ ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్ నగరంలో చికెన్ ప్రియులకు ఇది చేదు వార్తగా మారింది. చికెన్ సెంటర్లు మూతపడడంతో నాటు కోళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం నాటు కోళ్ల ధర కిలోకు రూ. 500 నుంచి 600 వరకు పెరిగిందని వినియోగదారులు చెబుతున్నారు.