హన్మకొండ జిల్లా, వేలేరు మండలంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశాల మేరకు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మురవత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో పార్టీ అనుబంధ సంఘాల కమిటీలను ఏకగ్రీవంగా బుధవారం ఎన్నుకున్నారు. బీసీ సెల్ అధ్యక్షుడిగా బుట్టి రవికుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా అక్కల శంకర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా మాలోతు రమేష్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎస్కే పాషాలతో పాటు ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బిల్లా యాదగిరి, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.