వరంగల్ జిల్లాలో అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) అబ్బయ్య, సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) షేక్ హమీద్‌లను వరంగల్ పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. నర్మెట్ట సీఐ అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట ఎస్సైగా పనిచేసి ప్రస్తుతం ఏఆర్‌కు అటాచ్ అయిన షేక్ హమీద్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సస్పెన్షన్ ఒకే కేసుకు సంబంధించింది.