నేడు హనుమకొండలో మేడారం హుండీల లెక్కింపు

హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతర హుండీలను గురువారం లెక్కించనున్నారు. జాతర సమయంలో గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 827 హుండీలను ఇప్పటికే ఆర్టీసీ కార్గోలో హనుమకొండకు తరలించారు. ఈ హుండీలలోని నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీలను లెక్కించి బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఈ ఆదాయం నుంచి పూజారులకు ప్రభుత్వం వాటా ఇస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్