వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్మూర్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కన్నె రాజు అలియాస్ స్విమ్మర్ రాజు, కెయుసి కానిస్టేబుల్ రవీందర్ ను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం అభినందించారు. వరల్డ్ రెడ్ క్రాస్ దినోత్సవం పురస్కరించుకొని సుబేదారిలో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో కన్నేరాజు 37వ సారి స్వచ్చందంగా రక్తదానం చేయగా, రవీందర్ 18 సార్లు రక్తదానం చేసారు.