షేర్ మార్కెట్ పేరుతో రూ. 12 లక్షల టోకరా: సైబర్ వంచకుడి అరెస్ట్

షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి, వరంగల్ వాసి నుండి రూ. 12 లక్షలు కాజేసిన తమిళనాడుకు చెందిన సైబర్ వంచకుడు పవన్ కుమార్ ను వరంగల్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ‘న్యూ వెల్త్’ అనే నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా బాధితుడిని మోసం చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని తమిళనాడులోని తిరువణ్ణామలైలో పట్టుకుని హన్మకొండ కోర్టులో హాజరుపరిచారు. నకిలీ ట్రేడింగ్ యాప్‌లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్