గుర్తుతెలియని మహిళ మృతి

వరంగల్ రైల్వే స్టేషన్‌లో శనివారం స్పృహతప్పి పడిపోయిన ఓ గుర్తుతెలియని మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరిచామని, ఆచూకీ తెలిసిన వారు వరంగల్ జీఆర్‌పీ స్టేషన్‌లో సంప్రదించాలని హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి కోరారు.

సంబంధిత పోస్ట్