ఉమ్మడి వరంగల్ జిల్లా, వరంగల్ (వెస్ట్) పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ రంగంపేటలో, స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా, 87వ బూత్ BLO పి. సురేఖ ఆధ్వర్యంలో BLAలు గురువారం ఇంటింటికి తిరిగి ఫారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన కాస కళ్యాణి, పొడిశెట్టి వాసు, కాంగ్రెస్ పార్టీకి చెందిన బిఎల్‌ఏలు కుమ్మరి మాలతి, జకిర, మొగిలి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.