కాజిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో, పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన శివరాత్రి దేవయ్య అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ 11వ సారి పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతన్ని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, మేజిస్ట్రేట్ ఎస్. ఫాతిమా చిన్నప్ప అతనికి 30 రోజుల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన గత రాత్రి చోటుచేసుకుంది.