ఎల్కతుర్తి: 'ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి'

శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఎల్కతుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఎస్ఎఫ్ఐ నాయకులు సందర్శించడం జరిగింది. ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ స్కూల్ బిల్డింగ్ లో 4 రూములు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు రూములు లేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి నూతన బిల్డింగ్ నిర్మించాలి అన్నారు.

సంబంధిత పోస్ట్