మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అరెస్ట్

హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలోని ఎర్రగట్టు గుట్ట జంక్షన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫోన్ ట్యాంపరింగ్ ఆరోపణలపై మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగాయి. ఈ నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్