పోలీస్ ఉద్యోగాల ఉచిత కోచింగ్: 560 మందికి శిక్షణ ప్రారంభం

వరంగల్ పోలీస్ కమిషరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పోలీస్ ఉద్యోగ కోచింగ్‌లో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన 560 మంది అభ్యర్థులకు భీమారంలోని శుభం ఫంక్షన్ హాల్‌లో మంగళవారం శిక్షణా తరగతులపై ముందస్తు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీ ఎన్. శ్వేత మాట్లాడుతూ, ప్రణాళికాబద్ధంగా, క్రమశిక్షణతో కష్టపడితే పోలీస్ ఉద్యోగం సాధించవచ్చని, గత కోచింగ్ ద్వారా పలువురు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని, కోచింగ్‌ను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని అభ్యర్థులను ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕