హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో 'హక్ దర్శక్' ఆధ్వర్యంలో బుధవారం ఉచిత సేవల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ-శ్రమ, ఆధార్ అప్‌డేట్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, పీఎంవై వంటి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, సుమారు 50 కార్డుల ఉచిత రిజిస్ట్రేషన్లు చేశారు. మే మొదటి వారంలో మరో క్యాంపు ఉంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.