నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గడువు పొడగింపు

తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా వివిధ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ అందించే కార్యక్రమం కింద దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 22 వరకు పొడిగించినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కె జగన్ మోహన్ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ నిరుద్యోగులకు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలతో పాటు ఆర్.ఆర్.బి, బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వంటి పరీక్షలకు ఐదు నెలల పాటు హనుమకొండలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. ఆన్లైన్లో http://tsstudycircle.co.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మార్చి 1న ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్