హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో తలసేమియా బాధితుల కోసం వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న డైనింగ్ హాల్‌కు భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి.