హనుమకొండ యాదవ నగర్‌కు చెందిన బిఎస్ఎన్ఎల్ ఉద్యోగిని కలకోట జీవన, ఆమె కుమార్తెలు సారా, నిస్సీలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో 22 దేశాల నుండి 2000 మందికి పైగా పాల్గొనగా, ఈ ముగ్గురు సుమారు గంటపాటు నాన్‌స్టాప్‌గా కీబోర్డు వాయిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి ఒకేసారి ఈ ఘనత దక్కడం విశేషం.