హన్మకొండ: 41 మంది పై ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు

హన్మకొండ జిల్లా కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 41కి పైగా ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదైనట్లు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు. ఆదివారం చేపట్టిన డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 37 మందితో పాటు లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన మరో నలుగురికి సోమవారం కోర్టు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని లేదంటే జరిమానా తప్పదని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్