హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పుర్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బొలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదన్‌పల్లికి చెందిన వధువు బృందం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వరుడి ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా, గోపాల్‌పుర్ వద్ద బొలేరోను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.