హనుమకొండ జిల్లా కేంద్రంలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ తరగతుల వసతులను శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్యే వర్ధన్నపేట కేఆర్ నాగరాజు పరిశీలించారు. నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, కార్పొరేషన్ కమిషనర్ చౌహాన్ బాజ్ పాయ్ పాల్గొన్నారు.