వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్ జులైవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కాలనీ అభివృద్ధే మా ధ్యేయం. ప్రజలకు మౌలిక సదుపాయాలు, శుభ్రత, మంచినీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు వంటి అంశాల్లో ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.