హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు, వేద పండితులు కలెక్టర్‌కు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, దేవస్థానం ఈఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు.