సెక్షన్ 100 ప్రకారం మానసిక వ్యాధిగ్రస్తురాలికి సహాయం

హనుమకొండ చౌరస్తా, గీతా భవన్ వద్ద మానసిక వ్యాధితో నిరాశ్రయురాలైన మహిళకు సహాయం అందించాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్, సీనియర్ నాయకులు బోడ డిన్నా మానవత్వంతో స్పందించి, హనుమకొండ సీఐకి వినతి సమర్పించారు. మానసిక ఆరోగ్య చట్టం, 2017లోని సెక్షన్ 100 ప్రకారం, వీధుల్లో నిరాశ్రయులైన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు పోలీసు అధికారులు సంరక్షణ, వైద్య సహాయం అందించాలని సీఐ హామీ ఇచ్చారు. అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్