వరంగల్ లోని MGM ఆసుపత్రిలో హెపటైటిస్-బి వ్యాక్సిన్ తీవ్ర కొరత ఏర్పడింది. గత కొన్ని రోజులుగా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో, వందలాది మంది రోగులు, గర్భిణులు, చిన్నారులు వ్యాక్సినేషన్ తీసుకోకుండానే వెనుదిరగాల్సి వస్తోంది. ఈ విషయంపై వరంగల్ డీఎంహెచ్‌ఓ ను వివరణ కోరగా, ప్రస్తుతం ఆసుపత్రిలో పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ మాత్రమే ఉందని, పెద్దలకు ఇచ్చే హెపటైటిస్-బి వ్యాక్సిన్ నిల్వలు లేవని స్పష్టం చేశారు. అయితే, వైద్య నిపుణుల ప్రకారం, చిన్నారులకు, పెద్దలకు ఇచ్చే హెపటైటిస్-బి వ్యాక్సిన్ ఒకటే అయినప్పటికీ, వాటి డోసేజీలలో తేడా ఉంటుందని తెలిపారు.