కార్పొరేటర్ వసంత ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనం

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 59వ డివిజన్‌లో కార్పొరేటర్ గుజ్జుల వసంత ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. వసంత ఋతువుకు స్వాగతం పలుకుతూ భవాని నగర్, ఎక్సైజ్ కాలనీ, కనకదుర్గ కాలనీ వాసులతో కలిసి రంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ వసంత, రసాయనిక రంగులకు దూరంగా ఉండి సహజ రంగులతో పండుగ జరుపుకోవాలని సూచించారు. ఐక్యత, ఆనందం, సుఖశాంతులు నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం 2026 మార్చి 4న జరిగింది.

సంబంధిత పోస్ట్