వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు

హోలీ పండుగ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఘనంగా వేడుకలు జరిగాయి. బ్యాండ్ వాయిద్యాల మధ్య అధికారులు, సిబ్బంది కమిషనర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని, పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను, ఆయన సతీమణిని రంగులతో ముంచెత్తారు. అధికారులు, సిబ్బంది, మహిళలు, చిన్నారులు కలిసి తీన్మార్, నాగిన్ డాన్స్ స్టెప్పులతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.

సంబంధిత పోస్ట్