హనుమకొండ జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఇజ్రాయిల్ దేశంలో "హోం బేస్డ్ కేర్ గివర్" ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రభుత్వం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు 25 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు, ఏఎన్ఎం, జిఎన్ఎమ్, ఎంపీహెచ్‌డబ్ల్యూ డిప్లమా ఇన్ పేషెంట్ కేర్ లేదా బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.