హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆదేశాల మేరకు, అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యార్థినుల ఉన్నత పాఠశాల లష్కర్ బజార్‌లో హెచ్‌పివి వ్యాక్సినేషన్ క్యాంపైన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 14, 15 ఏళ్ల బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ వేశారు. క్యాన్సర్లను నివారించి, దీర్ఘకాలిక రక్షణ కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని డాక్టర్ అనిల్ తెలిపారు. వివిధ సీజనల్ వ్యాధుల గురించి కూడా వివరించారు.