హన్మకొండలో తీవ్ర కలకలం: జెండాలు తొలగించిన యువకుడు అరెస్ట్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు హన్మకొండ పర్యటన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో, నగరంలో ఏర్పాటు చేసిన బీజేపీ జెండాలను ఓ యువకుడు తొలగించడంతో కలకలం రేగింది. పార్టీ కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించగా, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆ యువకుడు, 'మోడీ హిందు ముస్లింలను వేరు చేస్తున్నారు' అని సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్