ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో అనుమకొండ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరూరి సాంబయ్య, టీఆర్ఎస్ నాయకులు రసమయి బాలకిషన్ దళితులకు ద్రోహం చేస్తూ, అగ్రకులాలకు కొమ్ముకాస్తూ వారిని కించపరుస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్లలో జరిగిన సభతో టీఆర్ఎస్ భయపడుతోందని, దళితులను కించపరిచిన కేటీఆర్కు బాలకిషన్ మద్దతు ఇస్తూ దళిత ద్రోహిగా మారారని ఆయన విమర్శించారు. సీఎంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కొడవటి రవి ఇతర నాయకులు పాల్గొన్నారు.