హనుమకొండలోని గోపాలపురం చెరువులో అర్ధరాత్రి నిబంధనలకు విరుద్ధంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయని, మరో ప్రైవేట్ స్థలంలో డంపింగ్ చేస్తున్నారని స్థానికులు గుర్తించారు. వెంటనే డయల్ 100 కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రాగానే తవ్వకాలు ఆగిపోయాయి, అయితే మొరంతో వెళ్తున్న ఒక వాహనాన్ని, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అర్ధరాత్రి తవ్వకాల వెనుక ఎవరున్నారో తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.